ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
గురువారం భువనగిరి పట్టణంలోని 31వ వార్డులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యచరణలో బాగంగా వార్డు సభలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడడం జరుగుతుందని అన్నారు. రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పాస్ బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, డైట్ చార్జీల పెంపు , తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాలు వినియోగించుకోవాలన్నారు. త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యమై గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. వార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే అట్టి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూడడం జరుగుతుందని కలెక్టర్ వార్డు ప్రజలకు సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు లబ్ధిదారులు పొందుతున్న వివరాలను క్షుణ్ణంగా వివరించారు. అదే విధంగా నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం- ఇంటర్మీడియట్ కు విస్తరణ, వివరణ ప్రతిభావంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటర్ వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రియ వ్యవసాయం పథకాలపై గ్రామ సభలో ప్రజలకు వివరించారు.
ఈ వార్డు సభలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, 31 వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తభసుమ్, సంబంధిత అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.