Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం చేతిలో ఎస్ఈసీ కీలుబొమ్మ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హడావిడిగా మున్సిపల్ ఎన్నికలెందుకూ…?
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగా? లేక అధికార పార్టీ కుట్రా?నా
మేడారం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతిసేందుకే నోటిఫికేషన్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర ఎన్నికల కమిషన్.. తెలంగాణ ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎన్నికలంటే ఆఫీసులో ఫైళ్లు క్లియర్ చేసినట్టు చుట్టేయడం కాదని అవి ప్రజాస్వామ్యానికి పునాదులనే విషయాన్ని గ్రహించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగా? లేక అధికార పార్టీ కుట్రా?నా అని ప్రశ్నించారు. షెడ్యూల్, నోటిఫికేషన్ మధ్య ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకపోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఓ పక్క తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక “మేడారం జాతర” జరుగుతుంటే.. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. కోట్లాది మంది భక్తులు మేడారం వెళ్తుంటే… వారి విశ్వాసాలను దెబ్బతీసేందుకే నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన బహిరంగ లేఖ లేఖ రాశారు. రాష్ట్రంలో ఏ రాజ్యాంగ సంక్షోభం లేకపోయినా మున్సిపల్ ఎన్నికలకు ఇంత ఊపిరాడని హడావుడి ఎందుకని ప్రశ్నించారు. సామ దాన భేద దండోపాయాలతో ఎన్నికలను ముగించాలని ఎన్నికల సంఘం చూస్తోందని ఆరోపించారు. ఈ షెడ్యూల్ ప్రతిపక్షాలకు, మహిళలకు, కొత్త అభ్యర్థులకు శాపంగా మారితే అధికార పార్టీకి వరంగా మారిందన్నారు. ఇది సమాన అవకాశాల పోటీ కాదనీ అడ్డగోలుగా సృష్టించిన వ్యవస్థీకృత అసమానత అని ఆరోపించారు. సమయం కుదిస్తే ఎన్నికలు డబ్బలు, మద్యం, కండబలంతో నడిచే తంతుగా మారుతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై స్థానిక సంస్థల ఎన్నికలను మేనేజ్డ్ డ్రామాగా మార్చేశారని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ వెంటనే మున్సిపల్ ఎన్నికలో నోటిఫికేషన్ షెడ్యూల్ అంశంలో జోక్యం చేసుకోవాని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.