ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ పుణ్య కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ కూచుకుళ్ల సరితా రాజేష్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో సేవలందించారు.

అలాగే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని శ్రీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్సవ కమిటీ చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని, సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.