ముద్ర, జగిత్యాల టౌన్ : వెలమ విద్యార్థుల ఉన్నత చదువుల అభివృద్ధికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాలలోని పద్మనాయక మినీ ఫంక్షన్ హల్ లో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన వెలమ విద్యార్ధులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారైనా ఆయన అత్యుత్తమ మార్కులు సాధించిన 51 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల అద్యక్షులు అయిల్నేని సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి దన్నపునేని వేణు గోపాల్ రావు, ఉపాధ్యక్షుడు బండారి దివాకర్ రావు, కోశాధికారి వెన్నమనేని కృష్ణ రావు, సంఘటిత కార్యదర్శులు అయిల్నేని రవీందర్ రావు, ఇమ్మానేని ప్రశాంత్ రావు, కార్యవర్గ సభ్యులతో పాటు వెలమ సంక్షేమ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.