ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ సంయుక్త కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన బోగోజీ ముఖేష్ ఖన్నా నియామకం అయ్యారు.బోగోజీ ముఖేష్ ఖన్నా ను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ ఉత్తర్వులు జారిచేశారు.సేవా దళ్ ను పటిష్టపర్చాలని ముఖేష్ కు సూచించారు.ముఖేష్ కాంగ్రెస్ పార్టీలో చురుకైనా పాత్ర పోషిస్తూ అంకితభావంతో పనిచేయడంతో గుర్తింపు లభించింది.2007 లో కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో (ఎన్ ఎస్ యు ఐ)పనిచేసి కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపును పొందిన ముఖేష్ ను టీపీసీసీ సేవాధళ్ రాష్ట్ర స్థాయి పదవిలో నియామకం కావడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ ఖన్నాను పలువురు అభినందించారు.ఈ సందర్బంగా ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్థానని అన్నారు.నాకు అవకాశం కల్పించి, నా నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
