- రాష్ట్ర ప్రొబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
- వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి.
- పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు.
వికారాబాద్, ముద్ర ప్రతినిధి: డ్రగ్స్ సంస్కృతిని సహించకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రొబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి మంత్రి జూపల్లి రామకృష్ణారావు ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసుల నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి సరఫరా అవుతుందనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఉమ్మడిగా కార్యాచరణ బద్ధంగా నిఘా పెట్టాలని మంత్రి సూచించారు. అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిధులను కేటాయించి చెరువు కట్టల మీద, గుట్టల పైన, కాలువల పక్కన ఈత, తాటి, ఖజురా వంటి చెట్లను పెంచేందుకు ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో మీసం 5 ఎకరాల్లో చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం నుండి నీరా, కల్లును ఎగుమతి చేసే విధంగా ఎదగాలని మంత్రి తెలిపారు. కల్లు సేవించి మరణించిన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు. కల్తీ కల్లు మూలంగా కూలి నాలి చేసుకుని పొట్ట నింపుకుంటున్న పేదలు బలి కాకూడదని మంత్రి తెలిపారు. కల్తీ కల్లు విక్రయానికి పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. గౌడ్ అన్నల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి వనాలను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు హాని కలిగించే సంఘటనపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కార్యాలయాలు నిర్వహించకుండా ఉండేదుగాను ఎక్సైజ్ శాఖకు అది నూతన పోతున్న భవనాలను నిర్మించుకోవడం శుభ సూచికమని ఆయన అన్నారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ నాశనానికి డ్రగ్స్ ఎంతో కీడును కలిగిస్తున్నాయన్నారు. పల్లెల్లో కూడా డ్రగ్స్ వ్యాపిస్తున్నాయన్నాయని వాటిని అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన తెలిపారు. అదేవిధంగా రిసార్ట్ లపై ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ నివారణకు అధికారుల కృషి చేయాలి అన్నారు. ముందుగా కార్యాలయ ఆవరణలో మంత్రి, స్పీకర్, అధికారులతో కలిసి ఈత మొక్కలను నాటి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ విజయ భాస్కర్, అదనపు కలెక్టర్ ఎం సుధీర్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసు చంద్ర, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ శాఖ సర్కిల్, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
