Take a fresh look at your lifestyle.

అందరికీ సంక్షేమ ఫలాలు – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 

ముద్ర, మహబూబ్‌నగర్:

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలానికి చెందిన 84 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్నదన్నారు.గత పదే ళ్ల లో రాష్ట్రంలో చాలా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, గతంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు., ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేశామని, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, మీ ఆశ్శీస్సులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, యాదిరెడ్డి, టంకర కృష్ణయ్య యాదవ్, రఘుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, వెంకటయ్య, కేశవులు, వివిధ గ్రామాల సర్పంచులు బొట్టు శ్రీను, లింగం నాయక్, అచ్చెన్న, శ్రీను నాయక్, లోకేశ్, సత్యం నాయక్, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.