రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక భగత్ సింగ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 56 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా, సహాయ కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్మన్ విద్యా సాగర్ రెడ్డి,టీచర్లు రమాదేవి,శోభ,సత్తన్న,సతీష్,రవి,తిరుపతి,కరుణాకర్ పాల్గొన్నారు.