Take a fresh look at your lifestyle.

దళిత బిడ్డ కర్లా రాజేష్ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి లేదంటే ఈ నెల 14 న సీఎం హుజూర్ నగర్ పర్యటన అడ్డుకుంటాం – మాజీ ఎమ్మెల్యే మల్లయ్య

 

ముద్ర ప్రతినిధి , కోదాడ …..

కర్ల రాజేష్ కేసులో న్యాయం చేయకపోతే ఈ నెల 14 న హుజూర్నగర్‌లో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం అని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. మార్చి 14న సీఎం హుజూర్నగర్ పర్యటనకు రావడానికి ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా హుజూర్నగర్ నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని ముందుగానే హెచ్చరిస్తున్నాం అని అన్నారు. మా కోదాడ ప్రాంతానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్‌ను
చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో
పోలీసులు హింసించి చంపిన
ఘటనకు నాలుగు నెలలు గడిచాయి.
ఆ రక్తపు మరకలు ఇంకా ఆరలేదు.
ఆ కుటుంబం కన్నీళ్లు ఇంకా ఆగలేదు.
చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన
ఈ దారుణానికి కారణమైన అధికారులను కేవలం సస్పెన్షన్లతో,
ప్రమోషన్లతో కాపాడటం, దేనికి సంకేతం అని ఆయన ప్రశించారు .
వారిని వెంటనే సర్వీస్ నుండి తొలగించి, హత్య కేసులు నమోదు చేసి జైలుకు పంపడంలో మీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందన్నారు.
తన పై వ్యక్తిగత రాజకీయ కక్షతో  ఈ దళిత బిడ్డను హత్య చేశారని అన్నారు. నాలుగు నెలలుగా బాధిత కుటుంబంరోడ్లపై న్యాయం కోసం తిరుగుతుంటే, కనీసం పరామర్శించడానికి కూడా  మీకు గానీ, ఉత్తమ్ దంపతులకు గానీ  సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, బాధ్యులైన అధికారులను మరియు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపకుండా హుజూర్నగర్‌కు రావాలని ప్రయత్నిస్తే సీఎం పర్యటనను ప్రజల తరఫున అడ్డుకుంటామని అన్నారు.
పోలీసుల లాఠీలకు, కేసులకు, భయపడే వారుఎవరూ లేరని కర్ల రాజేష్‌కు న్యాయం జరగని పక్షంలో,
మార్చి 14న హుజూర్నగర్‌లో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను  అంగుళం కూడా ముందుకు కదలనివ్వమని తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.