Take a fresh look at your lifestyle.

మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందగా, ఒకరరు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఆర్‌ఎస్ఐ సుధీర్, జవాన్లు సందీప్, పవన్ కళ్యాన్ ప్రాణాలను కోల్పోయారు. ఈ ముగ్గురూ కూడా 25 ఏళ్ళలోపు వయస్సు కలిగిన వారు కావడం గమనార్హం. గాయపడిన ఆర్ఎస్ఐ రణధీర్‌ను  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించి, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కాగా, డీజీపీ జితేందర్, గ్రౌహౌండ్స్ డీజీ స్టిఫెన్ రవీంద్ర వరంగల్‌కు చేరుకుని మృతి చెందిన జవాన్లకు నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.