Take a fresh look at your lifestyle.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

  • జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : రాజకీయ కక్షలతో కొన్ని గ్రామాలకు చెందిన రైతుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని దాంతో అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జంగారెడ్డిపల్లి, మేడిగడ్డ,చింతలపల్లి, సంకటోనిపల్లి, ముర్తోజపల్లి, సాకిబండతాండ, విటాయిపల్లి గ్రామాల రైతులు సోమవారం మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి చేసి రైతులకు న్యాయం చేయాలి లేని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మార్కెట్ లోని ధాన్యం తడిసి మొలకెత్తడం జరిగింది వాటిని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల పక్షాన పోరాడుతారని అన్నారు. కార్యక్రమంలో ఆమనగల్ మాజీ జెడ్పిటిసి సభ్యుడు కండే హరి ప్రసాద్, మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ రాంపాల్ నాయక్, దుర్గయ్య ఆమనగల్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు కర్నాటి విక్రమ్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ నెంబర్ చెక్కల లక్ష్మణ్, కల్వకుర్తి అసెంబ్లీ కో కన్వీనర్ గోరటి నరసింహ,ఆమనగల్ మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు ఎర్రవోలు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, మేడిశెట్టి శ్రీధర్, భాషా భాయ్, శ్రీకాంత్ సింగ్, ఝాన్సీ శేఖర్, బీజేవైఎం నాయకులు రైతులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.