– తండోపతండాలుగా భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అంతారంతాండలో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దేవాలయ వ్యవస్థాపకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత శంకర్ నాయక్, వాసు నాయక్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇచ్చట ప్రసిద్ధిగాంచిన నీటి గుండం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తారు. తాండూర్ ప్రాంత ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా పట్టణంలోని భద్రేశ్వర స్వామి దేవాలయం, కోటేశ్వర స్వామి దేవాలయం, రాజీవ్ కాలనీ సమీపంలో ఇప్పల పరమేశ్వర దేవాలయం, హరిహర టౌన్షిప్ లోని శివాలయం లొ భక్తులు శివనామ స్మరణ చేస్తూ, శివయ్య స్వామిని నందిని దర్శించుకున్నారు.