మహదేవపూర్ ముద్ర:
2027 జనగణనలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటి 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. https://se.census.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఇంటి వద్ద నుండే సులభంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలని అన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి సులభంగా నమోదు చేయవచ్చని,నచ్చిన భాషను ఎన్నుకొని వివరాలు నమోదు చేయాలని తెలిపారు. గత నెల 26వ తేదీ నుండి ప్రారంభమైన స్వీయ గణన ఆన్లైన్ నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని స్పష్టంచేశారు.
ఈ నెల 11వ తేదీ నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ చేపడతారని తెలిపారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల పంపిణీకి జనగణన కీలకమని కలెక్టర్ తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారు కూడా తమ ప్రస్తుత నివాసం నుండే వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనగణన సందర్భంగా అందరూ తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ఖచ్చితంగా అందించాలని కోరారు. ఈ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, జనాభా లెక్కలకు మాత్రమే ఉపయోగించబడతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ నమోదు తదుపరి ఎన్యుమరేషన్ ఐడి వస్తుందని, అట్టి నంబర్ ఆధారంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని తెలిపారు. ఒక్క రోజే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ స్వీయ గణనలో పాల్గొనాలని ఆయన సూచించారు.