Take a fresh look at your lifestyle.

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత- అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:*
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.
కలెక్టరేట్ ఆవరణలో
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా  జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు.


జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ…100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంల డిపిఆర్ఓ రామచంద్ర రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, కైలాష్, రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.