ముద్ర కూకట్‌పల్లి :
కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు కండ్లకోయలోని నిమ్మల కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హరివర్ధన్ రెడ్డికి బండి రమేష్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కూకట్‌పల్లి మరియు మేడ్చల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.