ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరిని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ
ముద్ర ప్రతినిధి, భువనగిరి:
నిరంతరం ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారంకై ఉద్యమాలే ఊపిరిగా పనిచేస్తున్న పోచంపల్లి 4వ వార్డు సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. ఆదివారం పోచంపల్లి పట్టణంలోని 4వ వార్డు సిపిఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరిని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రజల ఓట్లు పొందడానికి అనేక వాగ్దానాలు ఇవ్వడం ఓట్లు పొంది గెలిచిన తర్వాత వాటిని అమలు చేసే కాడ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బిజెపి ఏడాదికి కొటీ ఉద్యోగాలని చెప్పి మాట తప్పిందని, స్వదేశీ జపంతో విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని దోచి పెడుతుంది విమర్శించారు. ప్రజలపై భారాలను మోపుతూ ప్రజల బతుకులను ఆగమాగం చేసిందని అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి చెప్పి అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పేదలకు సంబంధించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయక మోసం చేసిందని అన్నారు. బిఆర్ఎస్ ఏమో పదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమం, పట్టణాల అభివృద్ధిని మరిచి పాలన చేయడం వల్లనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేస్తున్నా ఈ పార్టీలను ఓడించాలని కోరారు. ప్రజల సమస్యలే తమ ఎజెండగా భావించి నిరంతరం కార్మికుల, కర్షకుల , వ్యవసాయ కూలీల, వృత్తిదారుల, మహిళల, విద్యార్థుల , యువజనుల, సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీని, పార్టీ తరఫున పోటీ చేస్తున్న వడ్డేపల్లి యాదగిరిని ప్రజలు ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి , కోట రామచంద్రారెడ్డి , సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు , ప్రసాదం విష్ణు , గూడూరు బుచ్చిరెడ్డి , పట్టణ, మండల కమిటీ సభ్యులు బుగ్గ లక్ష్మయ్య , పొన్నమోని కృష్ణ , పత్తి బిక్షపతి , నాయకులు పోతగల్ల రామచంద్రం , గుర్ర బాలయ్య , నల్లగారి నర్సింహ, బడుగు రాజన్ బాబు , చందుపట్ల శ్రీను , నల్ల మల్లేష్ , రేపాక నవీన్ , రేపాక మనోజ్ పాల్గొన్నారు.