Take a fresh look at your lifestyle.

పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చారిత్రాత్మకం: కాంగ్రెస్ నేతలు

ముద్ర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు కావడం పెరిక సమాజ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన నాయకులను ప్రభుత్వం ఎంపిక చేయడం అభినందనీయమని, కార్పొరేషన్ ద్వారా పెరిక కుల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని వారు సూచించారు.

గురువారం తమ నియామకాలపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి), వైస్ చైర్మన్ బుడిగం శ్రీనివాస్, రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఘటిక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కుల సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రులను కలుసుకునే ముందు పెరిక విద్యార్థి వసతి గృహంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మద్ద లింగయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదవులు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలో పెరిక సామాజిక వర్గం ఎంతో బలంగా ఉందన్నారు. దొంగరి వెంకటేశ్వర్లు మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థంగా సేవలందించారని ప్రశంసించారు. అలాగే బుడిగం శ్రీనివాస్‌ను వైస్ చైర్మన్‌గా నియమించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా సేవలందించిన నాయకులకు కార్పొరేషన్‌లో పదవులు ఇవ్వడం వారి సేవలకు గుర్తింపని తెలిపారు. కోకాపేటలో నిర్మాణంలో ఉన్న పెరికకుల ఆత్మగౌరవ భవనం పనులను అభినందిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దొంగరి వెంకటేశ్వర్లు, బుడిగం శ్రీనివాస్ నాయకత్వంలో పెరిక సమాజం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పెరిక సంఘీయులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఘటిక విజయ్ కుమార్ వెల్లడించారు. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను ఆహ్వానించే ప్రణాళిక ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చుంచు ఉసన్న, రాష్ట్ర కోశాధికారి సందేల లింగం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, హాస్టల్ జనరల్ సెక్రటరీ అచ్చా రఘు కుమార్, కోశాధికారి బాల్డురి రవి, కుంచాల శ్రీనివాస్, బొలిశెట్టి సతీష్, బొలిశెట్టి నరసింహారావు, ఎర్రంశెట్టి రవీందర్, రామినేని వెంకటేశ్వర్లు, చింతం రాజేశ్వర్, అల్లం నాగరాజు, జూకూరి మహేష్, ప్రొఫెసర్ వడ్డానం వాసు, యువ నాయకుడు దొంగరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.