Take a fresh look at your lifestyle.

విద్యా, పరిశ్రమల హబ్ గా కొడంగల్

– ఏడాదిలో కొడంగల్,
నారాయణ పేట లిఫ్ట్ పూర్తి
– పదిహేను రోజుల్లో భూసేకరణ పూర్తి
– రెండు నెలల్లో కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్
– టేకులకోడ్ సమీపంలో సిమెంట్ పరిశ్రమ
– లగచెర్ల ప్రాంతం లో విద్యా హబ్
– ముంబై, పూనా తరహా లో కొడంగల్, హైదరాబాద్ రహదారి
– అభివృద్ధి అంటే కొడంగల్ గురించి చర్చించుకోవాలి
– దేశానికే రోల్ మోడల్ గా కొడంగల్
– కొడంగల్ లో పర్యటన లో సీఎం రేవంత్ రెడ్డి
…………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………..
ఏడాది లోగా కొడంగల్- నారాయణ పేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామని రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం కొడంగల్ లో రూ. 110 కోట్ల వ్యయం తో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర ఆలయం పునర్ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా నారాయణ పేట, కొడంగల్ ప్రాంతాలు సాగునీటి సమస్య తో సతమతమవుతున్నాయని, ఈ ప్రాంతానికి పెద్ద పదవులు లేకపోవడంతో అభివృద్ధి జరగలేదని, ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గా గెలిచి ముఖ్య మంత్రి పదవి చేపట్టానని, మీ ఆశీర్వాదం తో పెద్ద పదవి చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తున్నానన్నారు.సీఎం గా బాధ్యత చేపట్టిన వెంటనే పదేళ్లు బీ ఆర్ ఎస్ పాలనలో తొక్కిపెట్టిన కొడంగల్, నారాయణ పేట లిఫ్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశానన్నారు. ఈ లిఫ్ట్ పనులు మీరో ఏడాది లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే భూసేకరణ పనులు కొలిక్కి వచ్చాయని, ఇంకా కొన్ని చోట్ల భూ సేకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కి అప్పగిస్తున్నానని ప్రకటించారు. భూమి సేకరించే గ్రామాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడి లిఫ్ట్ పనులకు అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మంత్రి శ్రీహరి దే అని సీఎం అన్నారు.రైతులకు భూ పరిహారం అందించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని, అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా భూ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఎన్నో ఏళ్లుగా జీవచ్చవం లా పడిఉన్న కొడంగల్ లిఫ్ట్ కు రేవంత్ రెడ్డి జీవం పోసినట్లు అయింది.దీంతో సాగునీరు లేక అల్లాడిపోతున్న ఇక్కడి రైతాంగానికి సీఎం తీపి కబురు చెప్పడంతో రైతులు సంబర పడ్డారు.


…………………………………….
టేకులకోడ్ వద్ద సిమెంట్ పరిశ్రమ:
……………………………………..
కొడంగల్ ప్రాంతం విద్యా, పరిశ్రమల హబ్ గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు.ఈ ప్రాంతం లో సున్నపు రాయి అధికంగా ఉందని, ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తారని, దీంతో ఈ ప్రాంత రహదారులన్నీ గుంతలమయంగా మారుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కు తరలించడం వల్ల ఈ ప్రాంతానికి నష్టమే కానీ లాభం లేదన్నారు. అందుకే టేకులకోడ్ వద్ద సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడి యువత కు ఉద్యోగాలు కల్పించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆరు నెలల్లో ఈ పరిశ్రమ పనులు పూర్తి అవుతాయన్నారు.
…………………………………….
లగచర్ల ప్రాంతంలో
విద్యా హబ్ :
……………………………………..
లగచెర్ల ప్రాంతం లో విద్యా హబ్ ను ఏర్పాటు చేస్తామని, ఇక్కడ కేజీ to పీజీ వరకు విద్యార్థులు చదువుకునేందుకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈకొడంగల్ ప్రాంతం లో మెడికల్, ఇంజినీరింగ్, ఐఐఐటి, పాల్ టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తున్నామని సీఎం అన్నారు.విద్యలో వెనుకబడిన కొడంగల్ ను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
……………………………………
కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తా :
……………………………………
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్ పనులు రెండు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ఆమోదం లభించిందని, వెంటనే పనులు పూర్తవుతాయన్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులో కి వస్తే కొడంగల్ ప్రాంతం లో ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.
……………………………………
2034 వరకు
మనదే అధికారం :
……………………………………..
2034 వరకు మనమే అధికారం లో ఉంటామని, కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గం లోని తండా లు కనీస సౌకర్యాలకు నోచుకోలేదని, తాను మొదట్లో కొడంగల్ ఎమ్మెల్యే అయిన తరువాత ప్రతి తండా కు రోడ్ల సౌకర్యం కల్పించామన్నారు. ప్రస్తుతం గ్రామాల కు ధీటుగా తండాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పటి నుంచి సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతో ఉందన్నారు. కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి లో నడిపించేందుకు రాష్ట్ర మంత్రుల సహకారం తో ముందుకెలుతున్నానని సీఎం పేర్కొన్నారు. ఇక్కడి రహదారులను ముంబై, పూణే రహదారుల్లా మార్చుతానన్నారు. ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు నేరుగా వెళ్లేందుకు రహదారి నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి అంటే కొడంగల్ లో చూడాలని ప్రతిఒక్కరూ అనుకునే విధంగా మార్చుతానని సీఎం అన్నారు. అందుకే ఇకనుంచి ఈ నియోజకవర్గం లో గుంపులు కట్టి రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత అభివృద్ధి పై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మంత్రులు దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి,పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.