విద్యార్థులే తన పిల్లలుగా ముందుకు..
కృషి ఉంటే మనుషులే ఋషులవుతారు..
విద్యార్థులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్న
పీడీ కోనేటి గోపాల్ కు పలువురు అభినందనలు..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే సామెతకు నిదర్శనం అనే సామేతకు నిదర్శనం బొమ్మలరామారం మండలం మర్యాల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు.. ఉత్తమ కోచ్ ఉంటే ఏదైనా సాధ్యం అనే పదానికి పిడి కోనేటి గోపాల్ విద్యార్థులను జాతీయస్థాయిలో రాణించేందుకు ఉత్తమ శిక్షణ ఇస్తున్నారు. ఎస్ జి ఎఫ్ క్రీడలలో జాతీయ స్థాయి కి ఎంపికై తమ ప్రతిభ కనబరిచారు. ఇటీవల జరిగిన సిం కేపప్ క్రీడల లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మర్యాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై అబ్బురపరిచారు. జిల్లాలో మారుమూల గ్రామమైన మర్యాల విద్యార్డులు అన్ని విభాగాల క్రీడాలలో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. చదువుకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా క్రీడలలో చక్కని శిక్షణ ఇస్తూ విద్యార్థులే తన పిల్లలుగా ఉత్తములుగా తీర్చిదిద్దుతున్న పిడి కోనేటి గోపాల్ ఎంతైనా అభినందనీయులు.

—————–
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ – 2025 సెకండ్ ఎడిషన్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సిం కప్ పోటీలకు మర్యాల బాలబాలికలు ఎంపికయ్యారు.
బాలుర ఖో ఖో విభాగం లో ప్రధమ స్థానం,
బాలికల ఖో ఖో విభాగం లో ప్రధమ స్థానం.
అథ్లెటిక్స్ బాలికల విభాగం లో టీం ఛాంపియన్ షిప్.బాలుర టీం ఛాంపియన్ షిప్ లో ప్రథమ స్థానం.అథ్లెటిక్స్ విభాగం లో ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోని రాష్ట్ర స్థాయికి ఎంపీకీయ్యారు.
బాలికల ఖో ఖో విభాగంలో వేదశ్రీ, శ్రావణి, ప్రవళిక, జష్మిత, రవళి, హరిష్మా, శ్రేష్ఠ, చరణ్య, హారిక,
అథ్లెటిక్స్ లో హరిష్మా,నిహారిక, అక్షయ
బాలుర ఖో ఖో విభాగంలో నరేష్, గోవింద్ సింగ్, తిరుపతి, సన్నీ, భవేష్, చరణ్, మణికంఠ, విష్ణువర్ధన్, అరుణ్ అథ్లెటిక్స్ లో దేవేందర్ లు ఎంపికయ్యారు.
ఈనెల 20 నుండి 23 వరకు నల్లగొండ జిల్లా కేంద్రం లోని మేకల అభినవ్ స్టేడియం లో జరుగు రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలలో హన్మకొండ జె ఎన్ ఎస్ స్టేడియం లో జరుగు అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని పాఠశాల పగిడిపల్లి నిర్మల జ్యోతి తెలిపి పిడి కోనేటి గోపాల్ ను అభినందించారు. తమ గ్రామ విద్యార్థులు జాతీయ స్థాయి తో పాటు రాష్ట్రస్థాయిలో పాల్గొంటూ తమ ప్రతిభ కనపరచడం పట్ల సర్పంచ్ సంగి గణేష్ తో పాటు పలువురు అభినందించారు