- తెలంగాణ అమర్నాథ్ యాత్రగా సలేశ్వరం జాతరకు గుర్తింపు.
- సలేశ్వరంజాతరకు వచే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.
- ఏప్రిల్ 11, 12, 13 తేదీలలో సలేశ్వరం జాతర నిర్వహించాలి.
- నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం లో ప్రతి సంవత్సరం చరిత్ర పౌర్ణమికి జరిగే సలేశ్వరం జాతరకు అధికారులందరూ సమన్వయము తో పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలిపారు.సోమవారం నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో, అదనపు కలెక్టర్,దేవసహాయం, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి తో కలిసి జిల్లా లోని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ చెంచు ప్రజల ఆరాధ్య దైవం సలేశ్వర లింగమయ్య జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 11, 12, 13 తేదీలలో (3 రోజుల పాటు) జరుపనున్న నేపథ్యంలో , ప్రజలకు కావలసిన సదుపాయాలను, వసతులను కల్పించాలని,అధికారులను ఆదేశించారు. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో లోయలలో కొలువై వున్న లింగమయ్య దర్శనార్తం ఇతర రాష్ట్రాల, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే సలేశ్వరం జాతర కు సంబంధించిన ఏర్పాట్లను, పూర్తి స్థాయిలో చేపట్టాలని , జాతర రోజుల్లో వైద్య అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జాతరలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులను నిర్వహించడంతో పాటు ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా అవసరమైనప చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్, బందోబస్తు, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆర్ డబ్ల్యూ ఎస్, అధికారుల్ని ఆదేశించారు. సలేశ్వరం జాతరకు జిల్లాతో పాటు ఆయా ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని ప్రజలకు సరిపడ రవాణా సదుపాయం కల్పించాలని ఆర్ టి సి అధికారులను ఆదేశించారు. సలేశ్వరం జాతరకు భక్తులకు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలని కలెక్టర్ సూచించారు.సలేశ్వరం జాతర సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైరింజన్ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లా అటవీ అధికారులు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని, మూడు రోజుల పాటు జరుగునున్న జాతరలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని డిటి డబ్ల్యూ ఓ అధికారులను ఆదేశించారు.గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సరైనా చర్యలు చేపట్టాలని, ఐ టి డి ఎ అధికారులను ఆదేశించారు. అచ్చంపేట ఆర్డీవో సలేశ్వరం జాతర నోడల్ అధికారిగా పని చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
