ముద్ర ప్రతినిధి, జగిత్యాల:జగిత్యాల పట్టణ నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక వసతుల నిర్మాణ పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ 4520 ఇండ్లను పూర్తి చేయటం జరిగిందని,2800 ఇండ్లకు సీసీ రోడ్డు పూర్తి చేసినట్లు తెలిపారు.16 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకును సరస్వతి గుట్టపై నిర్మించడం జరిగిందన్నారు.గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు సైతం మౌలిక వసతుల కల్పన జరగలేదన్నారు. నూక పల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీని జగిత్యాల మున్సిపల్ లో కలపడం జరిగిందని గెజిట్ కూడా వచ్చిందని, జగిత్యాల మున్సిపల్ నుండి నిధులు కేటాయించడం సిబ్బంది నియమించడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కాలనీలో పలువురు నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని ఎమ్మెల్యే శుభా కాంక్షలు తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు మిగిలిన 700 ఇండ్లను పారదర్శకంగా అందజేస్తామని తెలిపారు.బీద మధ్యతరగతి ప్రజలకు రాష్ట్రం లో ముఖ్యమంత్రి గారు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నారు.డబల్ బెడ్ రూం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది అన్నారు.డబల్ బెడ్ రూమ్ కాలనీకి అవసరమైన స్మశాన వాటిక గుడి బడి ఇతర వసతులు త్వరలో కల్పిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, బోడ్ల జగదీష్,జుంబర్తి రాజకుమార్, ప్రభాత్ సింగ్ ఠాగూర్,ఆరుముల్ల పవన్,రంగు మహేష్,ప్రవీణ్,డిఇ నాగేశ్వర్ రావు,ఏఇలు శరన్,అనిల్,శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి,రాము,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
