Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి … సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి చేసేందుకు కృషి చేస్తా… ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

 

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీ పూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమంలో భాగంగా సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు, జాతీయ ప్రకృతి వ్యవసాయ కిట్లు అందజేసి, రైతులతో కలిసి భూసార రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. నేడు రాష్ట్రంలో మార్క్ పేడ్ రూ.10,000 కోట్ల నష్టాల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం మక్కలకు రూ.2,400 మద్దతు ధర కల్పిస్తుందని, కానీ చేతల్లో చూపడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు రూ.800 వరకు నష్టాన్ని భరిస్తూ మొక్కలు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. బయట మార్కెట్ లో మొక్కజొన్న రూ.1500 గా ధర ఉందని అన్నారు.

మార్క్ ఫెడ్ 10,000 కోట్ల నష్టాల్లో ఉంటే దాదాపుగా సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా నష్టాల్లోనే ఉందని అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి రైతుల నుండి పూర్తి స్థాయిలో స్పందన లేదని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని రైతులు ఉపయోగించుకొని పాల్గొన్నట్లయితే  శాస్త్రవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్సాహంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.

రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఇష్టారీతిన అధిక ఎరువులు వాడకం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు. పంట సాగు పరీక్షలు చేపించి, సరైన ఎరువులు, విత్తనాలు వాడాలని అన్నారు. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల నుండి పంట సాగు బడి అంశాలు నేర్చుకోవాలని రైతులు పంట సాగు పై పెట్టుబడి తగ్గించి లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. రైతులు అందరూ ఒకే పంట కాకుండా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంట మార్పిడి వైపు దృష్టి సారించాలని అన్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో సీడ్ ప్రాసెస్ యూనిట్ పూర్తి చేయటానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో DAO భాస్కర్,ADA తిరుపతి నాయక్,AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, సర్పంచ్ కవిత,ప్రొఫెసర్ సుజాత, సైంటిస్ట్ లు రవి రాజేష్ స్వాతి Aeo హరీష్, మాజీ సర్పంచులు చెరుకు జాన్, తిరుపతి రెడ్డి, గర్వాన్దుల గంగన్న, మాజీ ఆత్మ ఛైర్మెన్ ఏలేటి రాజీ రెడ్డి, పురిపాటి రాజీ రెడ్డి, బాల ముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, బాపూరెడ్డి, మల్లేష్, ధనేశ్వర్ రావు, గిద్దె రాజు, శంకర్, తిరుపతి, రాజేష్, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.