- అత్యంత పేద కుటుంబాల గుర్తింపు ప్రక్రియయ
- చెంచుల జీవన శైలిపై పరిశీలన.
- మహిళా సమైక్య సంఘాలతో సమావేశం.
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చెంచుల నివాస ప్రాంతమైన అడవిలో చెంచుల జీవనశైలి పైన వారి స్థితిగతుల ఆధారంగా మహిళా సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ బడావత్ సంతోష్ సమావేశం నిర్వహించారు.అణగారిన వర్గాల, పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలని సంకల్పించుకోని, నిజమైన పేదవారినే గుర్తించాలని బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు పి ఉషారాణి అన్నారు.బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ (BRAC-UPNRM) సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కలిసి అమ్రాబాద్, పదర మండలాల్లో అత్యంత పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల పరిస్థితిని పరిశీలించారు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా, అమ్రాబాద్ మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో చేపట్టిన అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న 440 కుటుంబాల గుర్తింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో మంగళవారం సందర్శించి పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు, బంగ్లాదేశ్ ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారిత మిషన్ సభ్యులు మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో నిరుపేద కుటుంబాల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు.మల్లాపూర్ పెంట, చౌట్టిగూడెం పెంట మరియు అమ్రాబాద్, పదరా మండలాల మహిళా సమైక్య సభ్యులతో స్మృతి శరణ్ గ్రామీణ అభివృద్ధి భారత మంత్రిత్వ శాఖ జైన్ జాయింట్ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలంగాణ రాష్ట్ర గ్రామీణ నిరుపేద నిర్మూలన సంస్థ డైరెక్టర్ దివ్య దేవరాజన్, లతో కలిసి కేంద్ర ప్రభుత్వ అధికారులు, సంస్థ సభ్యులు మన్ననూరు రైతు వేదికలో సమావేశమయ్యారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజల అందేలా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. గత ఆరు మాసాలుగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అమ్రాబాద్, పదర మండలాల్లోని 15 గ్రామాల్లో సమైక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో గుర్తించిన 440 అత్యంత పేదరికంతో జీవిస్తున్న ప్రజల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, లేని పేదలకు వెంటనే మంజూరు చేయాలని, అధికారులే ప్రత్యేకంగా నమోదు ప్రక్రియను చేపట్టి వారికి వెంటనే అందజేయాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం నుండి జిల్లాలో గుర్తించిన నిరుపేదలకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి రానున్న రెండు సంవత్సరాల్లోనే వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. నేడు పర్యటించిన మల్లాపూర్ పెంట చౌట్టిగూడెం పెంటల్లో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా డిఆర్డిఏ, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రేషన్ కార్డు లేని కుటుంబాల వివరాలను సేకరించి నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియను మీ సేవలో కూడా రెవిన్యూ , పౌరసరఫరాల అధికారులే నమోదు చేసి వెంటనే మంజూరు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. చెంచు గూడెంలోని కుటుంబాల సభ్యులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు కలెక్టర్ ఆదేశించారు.ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సభ్యులు పి ఉషారాణి మాట్లాడుతూ.. నిరుపేదల అభ్యున్నతికి ప్రభుత్వ శాఖల అధికారులు మహిళా సంఘాల సభ్యులు కృషిచేసి రానున్న 2 సంవత్సరాల్లో పేదల జీవితాల్లో అభ్యున్నతి సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. జిల్లాలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు.అంతకు ముందు మల్లయ్య పెంట, చౌట్టిగూడెం లను సందర్శించి అడవిలో జీవిస్తున్న చెంచుల జీవనస్థితిగతులు ఆర్థిక వనరులు, అడవిలో దొరికే ఉత్పత్తుల వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని రైతు వేదికలో అమ్రాబాద్, పదర మండలాల మహిళా సమైక్య సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర గ్రామీణా పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ దివ్య దేవరాజన్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ లతో కలిసి కేంద్ర ప్రభుత్వం బృందం మహిళల జీవనోపాదులు, ఆర్థిక అంశాలపై సమావేశం నిర్వహించారు. చెంచుల అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందించటం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారికి ఏ రకంగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందనేది సర్వే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.చెంచుల అవసరాలను గుర్తించటం, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు, వివిధ అంశాలపై సమావేశంలో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, డిప్యూటీ సిఈఓ గోపాల్ నాయక్, అమ్రాబాద్ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ రజిని, వివిధ శాఖల జిల్లా అధికారులు మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

