- దేశం,ధర్మం కోసం పోరాడిన వారి చరిత్రను భవితరాలకు అందించాలి.
- అహల్యబాయి జయంతి ఉత్సవాల కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్.
ముద్ర, రాయికల్: రాయికల్ మండల కేంద్రంలోని లలితాంబా ఆలయంలో పుణ్యశ్లోక, లోకమాత, రాజమాత రాణి అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగాఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ్వహించి అర్చకులను శాలువాలతో సత్కారించారు. ఈ సందర్బంగా అహల్యబాయి జయంతి ఉత్సవాల కమిటీ జిల్లా కన్వీనర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ అహల్యబాయి బాల్యం నుండే గొప్ప శివ భక్తురాలని ఆమె భక్తికి మెచ్చి ఎనిమిదేళ్ల వయసులోనే ఇండోర్ రాజు అయిన మల్హర్ రావు హోల్కర్ అహల్యబాయి తండ్రిని ఒప్పించి తన కొడుకు అయిన ఖండేరావుతో వివాహం జరిపించారని అన్నారు. ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన అహల్యబాయి పెళ్లి తర్వాత అనతికాలంలోనే భర్తను, మామను, కొడుకును కోల్పోయిన పట్టువదలని విక్రమార్కుడిలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజ్యాధికారం చేతబూని స్వయంగా 500 మంది మహిళలతో సైన్యం ఏర్పాటు చేసుకొని శత్రువులపై పోరాడి తన సంస్థానాన్ని సురక్షితంగా పాలించిన గొప్ప యోధురాలు అని అన్నారు.మొఘలుల చేత ధ్వంసం చేయబడ్డ దేవాలయలైనా కాశి, మధుర, అయోధ్య,పూరి జగన్నాథ్, శ్రీశైలం, వైద్యనాథ్, కేదారినాథ్, త్రయంభకేశ్వర్ లాంటి 157 దేవాలయాలను ధార్మికమైన దాత్రుత్వంతో సొంతడబ్బుతో పునరుద్దరించి హిందుత్వం పట్ల, సనాతన ధర్మం పట్ల తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారని అన్నారు. అంతేకాకుండ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు జీర్నోద్దరణకు గురైన వందలాది గుళ్లను పునర్నిర్మించారని భక్తుల సౌకర్యార్థం ధర్మశాలలు నిర్మించారని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఆలయాలకు భక్తులు నడవడానికి వీలుగా రోడ్లను నిర్మంచారని అన్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భారతదేశ రాణుల, రాజుల చరిత్రను బావితరాలకు తెలియనీయకుండా భారతీయ సనాతన ధర్మాన్ని మరుగున పడేసేందుకు స్వాతంత్ర్యనంతరం వరుసగా అయిదు పర్యాయాలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారిని విద్యా మంత్రులుగా చేసి భారతీయుల అసలైన చరిత్రను బ్రష్టు పట్టించి అక్బర్, బాబర్, అలెగ్జాండర్ ల చరిత్రను మాత్రమే పాఠ్యపుస్తకాల్లో చేర్చి భారతీయ విద్యార్థుల మస్తకంలోకి పుస్తకం రూపంలో ప్రాథమిక దశనుండే విషం ఎక్కించారని అయినా భారతీయ జీవన విధానం, సనాతన దర్మాన్ని అంతం చేయలేకపోయారని దానికి స్ఫూర్తి అహల్య బాయి లాంటి వారియొక్క కృషి, పట్టుదల, పరిపాలన విధానమే కారణం అని అన్నారు.నరేంద్ర మోదీ గారు కూడ రాణి అహల్యబాయిని స్ఫూర్తిగా తీసుకొని అమెరికా,లండన్,సౌదీ, దుబాయ్ ఇతర దేశాలలో గుళ్ళు నిర్మించారని అదే స్ఫూర్తితో ఆపరేషన్ సిందూర్ పేరుతో సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టికరిపించారని అన్నారు.రానున్న నూతన విద్యావిధానంలో భారతదేశ వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠ్య్తంశాలుగా చేర్చి భావితరాలకు భారతీయుల గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఎన్నో దేశాలు కాలగర్భంలో కలిసిపోయినా సనాతన ధర్మం ఇంకా బతికిఉండి ప్రపంచానికి దిశ నిర్దేశం చూపించే స్థాయిలో ఉందంటే డానికి మూల కారణం అర్చకులేనని వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ఈకార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సురతాని భాగ్యలక్ష్మి,కమిటీ సభ్యులు సంబారి కళావతి, దురిశెట్టి మమత, రాయికల్ పట్టణ అధ్యక్షులు కుర్మ మల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భూమేష్, అందె శంకర్, గంగరాజం, అశోక్, అజయ్, శంకర్, లక్ష్మి, గంగాధర్, వెంకటాద్రి, జలందర్ తదితరులు పాల్గొన్నారు.