Take a fresh look at your lifestyle.

స్థానిక సంస్థలు ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం

  • ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్,విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అనేది చారిత్రాత్మక నిర్ణయమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్,విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపగా పార్టీ కార్యాలయం లో స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ 1లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో కుల గణన చేయటం జరిగిందన్నారు.కేంద్రం సైతం జన గణన లో కుల గణన కూడా కలపడం రాష్ట్ర ప్రభుత్వ కష్టానికి, నిబద్ధతకు గుర్తింపు దక్కిందన్నారు.బీసీ రిజర్వేషన్,కుల గణన అసెంబ్లీ లో ప్రవేశ పెట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ లో అమోదం తెలపడం తనకు ఈ సువర్ణ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్న.. జగిత్యాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్ననని పేర్కొన్నారు.రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్రం రాజ్యంగా సవరణ చేయాలని అన్నారు.మున్సిపల్,పంచాయతీ ఎన్నికల లో రిజర్వేషన్ బీసీ లకు రాజకీయ ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశమని, ముఖ్యమంత్రి అగ్ర వర్ణాలకు చెందిన బీసీ పక్షపాతి పథకాలు,కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.గతంలో గంగపుత్రులకు చెరువులపై,గౌడ కులస్తులకు చెట్టుపై,రజకులకు దోబి ఘాట్ హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.నేడు వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎస్ ఆర్ ఎస్ పీ ప్రాజెక్ట్, బాగ్రానంగల్ ప్రాజెక్ట్ నిర్మాణం,జగిత్యాల కేంద్రం గా కాడా ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకు గుండె కాయగా ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో బీసీ ఎస్సీ ఎస్టీ లకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని,రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డిఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారని,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్ అమలు కానుందన్నారు.గత ఎన్నికల్లో సైతం బీసీ ఎస్సీ ఎస్టీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి బి ఫాం లు ఇచ్చి పెద్ద పీట వేయటం జరిగిందని తెలిపారు. గతంలో తమిళనాడుకు ఇచ్చిన రిజర్వేషన్ సవరణ తెలంగాణకు కూడా అమలు చేయాలన్నారు.బీసీ రిజర్వేషన్ కమిటీ, ఉప సంఘం, సభ్యులు, మంత్రులు, క్యాబినెట్ సభ్యులు,ముఖ్యమంత్రికి బీసీ ల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.గురువారం రోజు బీసీ లకు ఒక సంతోషకరమైన, మరపు రాని రోజు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంట జగిత్యాల నియోజకవర్గ నాయకులు మోర హనుమాన్లు, గిరి నాగభూషణం, కోల శ్రీనివాస్, బాల ముకుందం ,అడువాల లక్ష్మణ్, రవీందర్రావు, గన్నెరాజిరెడ్డి ,కాటిపల్లి గంగారెడ్డి ,రాజేందర్ రెడ్డి మనోహర్ రెడ్డి,క్యాదసు నాగయ్య,చెట్పల్లి సుధాకర్,అంకం సతీష్, శేఖర్ గౌడ్, ముసుకు నారాయణరెడ్డి, గంగ రాజం, కుసరి అనిల్, వీరబత్తిని శ్రీను, రవీందర్ రెడ్డి, గోడిసెల గంగాధర్, రౌతుగంగాధర్, రామ్మోహన్రావు, శ్రీనివాస్ గౌడ్,కట్టరాజేందర్ ,గంగారెడ్డి, బిక్షపతి, జింబర్తి రాజ్ కుమార్ ,క్యాదసు నవీన్, సొల్లు సురేందర్, సుశీల్, హరీష్ ,మల్లారెడ్డి, సుధాకర్ రావు ,ప్రవీణ్ రావు,రవి ,ప్రవీణ్ ,గంగాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.