ముద్ర, కోరుట్ల;
సీనియర్ న్యాయవాది గంగుల సత్యార్థప్రకాశ్ పై దాడి హేమమైన చర్య అని, న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని సోమవారం కోరుట్ల లో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ ఒక సీనియర్ న్యాయవాదిపై దాడి చేయడం హేమమైన చర్య అని న్యాయవ్యవస్థలో న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యంగా పరిస్థితి ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఈనెల 24 శుక్రవారం రాత్రి ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి సీనియర్ న్యాయవాదిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దాడి జరిగి మూడు రోజులు జరుగుతున్న పోలీసులు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఒక సీనియర్ న్యాయవాదిపై ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి దాడి వెనుక ఎంతటి వారున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బార్ అసోసియేషన్ పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బార్ అసోసియేషన్ పక్షాన కోరుట్ల సీఐ లక్ష్మినారాయణ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తోట ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు