- శ్రీరామ పాద క్షేత్రంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంకల్పం.
- రామగుండంలో చురుకుగా 108 అడుగుల శ్రీ ధనుర్బాణ రామాంజనేయ విగ్రహ నిర్మాణం పనులు.
- ప్రత్యేక శ్రద్ధతో నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే. పర్యాటక కేంద్రంగా శ్రీరామ పాద క్షేత్ర హనుమాన్ విగ్రహం.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: శ్రీ సీతారామ లక్ష్మణులు పాద క్షేత్రములతో రాముని గుండాలలో పాదం మోపి పర్యటించిన నేలగా రామగుండానికి పేరుగాంచినది ప్రఖ్యాత చారిత్రక చరిత్ర కలిగిన రామగుండానికి హిస్టారికల్ చరిత్ర ఉంది.సీతారాముల వనవాసంలో భాగంగా రాముని గుండంలో పర్యటించి సీతారామ లక్ష్మణ లు స్నానమాచరించిన నీటి గుండాలు జలపాతాలు వారు మోపిన పాదం గుండాల గుట్టలలో ఇప్పటికి దర్శనం ఇస్తాయి. ఇలాంటి తరుణంలో 2024 నవంబర్లో రామగుండం నగరంలోని శ్రీరామ పాదక్షేత్రంలో రాముని గుండాల చెంత అద్భుతం జరిగింది.రామగుండం ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న రాముని గుండాల గుట్ట పైన కొంతమంది కాకర చెట్టు తీగలపై కాకరకాయలు తెంపుతుండగా సమీపంలో ఓ పెద్ద బండరాయి కనిపించింది.దగ్గరికెళ్ళి నాలుగు వైపులా ఆ బండ రాయిని తిప్పి చూడగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహంల కనిపించింది.అప్పుడు వారు దానిని నీటితో శుభ్రం చేసి చూడగా ఎక్కడ ఎప్పుడు ప్రపంచంలో చూడని విధంగా ఉన్న శ్రీ హనుమాన్ విగ్రహం బాణం పిడి కత్తితో దర్శనమిచ్చింది.మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి కుటుంబం తరపున రామగుండం తాసిల్దార్ ఆఫీస్ ముందర గుట్ట ప్రాంతం లో ఒక పెద్ద శ్రీహనుమాన్ విగ్రహం నిర్మాణం చేయాలనీ చాలకాలం నుండి ఎమ్మెల్యే కోరుకుంటున్నారు,అదే సమయం లో వారు రామగుండం ఎమ్మెల్యేగా గెలవడం,హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతా రాములు వారి కోరికను నేర వేర్చుటకై అన్నట్లుగా 2024 నవంబర్ లో రామగుండం నగరం లోని శ్రీ రామ పాద క్షేత్రం రాముని గుండాల చెంత స్వయంభూ గా వెలిసిన శ్రీ ధనుర్భావన ఆంజనేయ విగ్రహం దర్శనం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనుకున్న ప్రదేశం లో ధనుర్బాన శ్రీరామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన పూనుకున్నారు. వెంటనే ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రదేశమునకు వచ్చి చూసి అట్టి విగ్రహాన్ని పైకి తీసుకు వచ్చి ఒక చెట్టు కింద నిల పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు.ఇట్టి విషయం స్థానిక శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి తెలిసి వారు సతీ సమేతంగా ఈ ప్రాంతాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని చాలా సంబర పడి పోయారు.తనకు ఎంతో కాలంగా వున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించాలన్న సంకల్పానికి సాక్షాత్తుగా హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతా రాములు అనుమతి ఇచ్చినట్లుగా భావించారు.ఇది యాదృశ్చికమో దైవ సంకల్పమే అని తలచి వెంటనే మరో ఆలోచన చేయకుండా అదే రోజున అక్కడే 108 ఫీట్ల శ్రీ హనుమాన్ విగ్రహం నెలకొల్పాలని నిర్ణయం తీసుకొని పూజలు చేసారు.వేదపండితులని పిలిచి వారికి శ్రీ హనుమాన్ విగ్రహాన్ని చూపగ వారు అందరు అట్టి విగ్రహాన్ని తాము ఎక్కడ చూడలేదని,అందరు కలసి వేదాలను శోధించి శ్రీ స్వామి వారికి శ్రీ దనుర్బాన రామాంజనేయ స్వామి గా నామకరణం చేసారు ఇలా శ్రీ రాముడు సీతా,లక్ష్మణసమేతంగా ఈ ప్రదేశంలో వన వాసం చేసి నప్పుడు వారి పాదం మోపిన చోట శ్రీ ధనుర్భాణ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టకు, 108 ఫీట్ల స్వామి వారి విగ్రహం,ధ్యాన మందిరం మొదటి అంతస్తులో 8 దిక్కులలో ఒక్కో దిక్కున 8 రకాల శ్రీ హనుమాన్ విగ్రహం లను 18 ఫీట్ల ఎత్తు తొ నెల కోల్పేందుకు సంకల్పించారు. ధ్యాన మందిరం తో పాటు అన్నదాన సత్రం, భక్తులు దర్శించుకునేందుకు వచ్చే సుదూర ప్రాంతాల వారికి వసతి సత్రాలు కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ,దేవదాయ శాఖ మంత్రులతో కమిషనర్లతో సంప్రదింపులు జరిపి రాముని గుండాల క్షేత్రంలో 108 అడుగుల ధనుర్బాన శ్రీరామాంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు హరిత హోటల్ ఏర్పాటు చేసేందుకు రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో అన్ని రకాల అనుమతుల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. 2026 పెద్ద హనుమాన్ జయంతి వరకు 108 అడుగుల ధనుర్బాన శ్రీరామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణ పనులు పూర్తి అవుతాయని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ధనుర్బాన శ్రీరామాంజనేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయానికి సంబంధించిన కాంట్రాక్టర్ తమిళనాడు నుండి ప్రత్యేక ఆర్కిటెక్చర్ తో దేవాలయాలను నిర్మించే కళా నైపుణ్యం ఉన్న పని వాళ్ళతో నిర్మాణ పనులను చకచకా పూర్తి చేస్తున్నారు సుమారు 8 కోట్ల వ్యయంతో ధనుర్భావ శ్రీరామాంజనేయ 108 అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.