- రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి రంగినేని శ్రీనివాస్ రావు.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలోఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు లింగాల మండలం భాకారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు పాల్గొని భూభారతి గురించి రైతులకు వివరించారు.ఈ సందర్భంగాశ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన భూభారతి తో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.భూమీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన భూభారతి చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. రైతుల పక్షాన నిలబడే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతే రాజు అని నమ్మే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను దరఖాస్తు చేయదగిన రైతులందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు రైతులు పూర్తిగా సహకరించాలని సూచించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు భూమి సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఎమ్మార్వో పాండు నాయక్, ఆర్ ఐ అనిల్, మరియు రైతులు కాంగ్రెస్ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.
