- సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా ఆర్జి.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డు ద్వారా అర్జీ చేశారు.పి డి ఎస్ యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరుగురాల కళ్యాణ్
గురువారం రామగుండం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి ఉత్తరాలు రాశారు.ఈ సందర్భంగా పి డీ ఎస్ యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కళ్యాణ్ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను మర్చిపోయింది అన్నారు దాదాపు రాష్ట్రంలో 8,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు.స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు విడుదల చేయని కారణంగా ఇంటర్,డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు.తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ల ను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వనికి హెచ్చరించారు.ఈ పోస్ట్ కార్డులను గోదావరిఖని తపాలా కార్యాలయం లో తెలంగాణ సచివాలయం కు పోస్ట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.