- ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలి.
- కలెక్టర్ సత్య ప్రసాద్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో వారి ధాన్యం కేంద్రాలలో ఉన్న ధాన్యము ఆరబోసి మ్యాచర్ వచ్చిన వెంటనే వేగవంతంగా కొనుగోలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం సోమన్ పల్లి, ధర్మపురి మండలం జైన లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లాలోని వరి ధాన్యం కేంద్రాల్లో తడిసిన ధాన్యము ఆరబోసి మ్యాచర్ వచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు వెంటనే తరలించాలని కొనుగోలు చేసిన వెంటనే రైస్ మిల్లర్లకు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతిరోజు మిల్లులకు పంపాలని, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వేగవంతంగా పూర్తి చేయాలని.రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సెంటర్ ఇంచార్జ్ అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఎం జితేంద్ర ప్రసాద్, జగిత్యాల రూరల్ తహసిల్దార్ శ్రీనివాస్, ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
