*రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆదుకోవడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
ముద్ర,తుంగతుర్తి….
రాష్ట్రంలోని రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందించే నాణ్యమైన ధర పొందాలని ఎమ్మెల్యే అన్నారు
కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రతిపక్షాలు తట్టుకోలేక రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డును అందించలేదని విమర్శించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెండో విడతలు మరింత మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.రైతులు గిట్టుబాటు ధర పొందాలంటే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలని అన్నారు.దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని సూచించారు. వేసవికాలం దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నీడ,నీటి వసతి తోపాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు సకాలంలో అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, సత్యం తాహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏ రమేష్ బాబు, కోపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎస్ కే బడే సాబ్, సొసైటీ సీఈవో యాదగిరి,తుంగతుర్తి సింగిల్ విండో మాజీ చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి,మద్దిరాల, నూతనకల్, నాగారం, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దొంగరి గోవర్ధన్,అవిల మల్లు, తోడుసు లింగయ్య, నాగం సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు రేగటి రవి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బికోజి,తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, మాచర్ల అనిల్, కొండ రాజు, పెద్ద బోయిన అజయ్, గంగరాజు,పచ్చిపాల సుమతి,దాయం ఝాన్సీ రాజిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను నాయకులు యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు.

మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడి సూపర్వైజర్లకు టీచర్లకు చరవాణిల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు.అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేయడం ద్వారా డిజిటల్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం కావడంతో పాటు సమాచార మార్పిడి సులభతరం అవుతోందని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు సంక్షేమ సేవలను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు.అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి ద్వారా గ్రామీణ కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిది, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,స్థానిక తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష కుమార్, ఎంఈఓ బోయిని లింగయ్య,తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి,మద్దిరాల, నూతనకల్, నాగారం, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, అవిల మల్లు, తోడుసు లింగయ్య, నాగం సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు రేగటి రవి, పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, మాచర్ల అనిల్, కొండ రాజు, పెద్ద బోయిన అజయ్, పచ్చిపాల సుమతి, దాయం ఝాన్సీ రాజిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను నాయకులు యువజన నాయకులు, పలు మండలాల అంగన్వాడి సూపర్వైజర్లు,టీచర్లు, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.