Take a fresh look at your lifestyle.

జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే…

జగిత్యాల జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ..జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కోసం జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో రాజ
కీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 25 నుంచి జులై
24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని అన్నారు. జులై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. జులై 31 నుంచి ఆగస్టు 30వరకు అభ్యంతరాలను స్వీకరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ఓటర్ల వివరాల ధ్రువీకరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపు ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. కచ్చితమైన ఓటరు
జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.