Take a fresh look at your lifestyle.

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ జానకి ఆర్థిక సాయం అందజేశారు.శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డు కుమారునికి ఈ సాయం అందించారు.ఫిబ్రవరి 16 న మహిళా హోంగార్డు నాగమణి గుండెపోటుతో మరణించారు. ఆమె కుటుంబానికి తోడ్పాటు అందించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు కలిసి స్వచ్ఛందంగా రూ.లక్ష పోగుచేశారు. ఈ మొత్తాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి చేతుల మీదుగా ఆర్థిక సాయం నాగమణి కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తోటి హోంగార్డు కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పెద్ద మనసుతో సహాయం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి సంఘీభావం పోలీస్ కుటుంబంలో ఉన్న ఐక్యతను, మానవత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. పోలీస్ శాఖకు నాగమణి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆమె కుటుంబానికి భవిష్యత్తులో అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్.ఐ. అశోక్ కుమార్, ఎం.టి.ఓ నాగేష్, ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, స్వామి గౌడ్ తదితర హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.