ముద్ర మోత్కూర్ :
మండలంలోని పాటిమట్ల ఉన్నత పాఠశాల లో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు కలెక్టర్ గా డీఈవో గా ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో కనిపించి పాఠశాలలో ఉత్తేజ తర్వాత వాతావరణాన్ని కలిగించారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులు బోధనలో చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. నేటి ప్రధాన ఉపాధ్యాయులుగా మొగులగాని మానస, కలెక్టర్ గా చల్ల పల్లవి, డిఈవో గా కొమ్మ మనీషా, డిప్యూటి డీఈవో గా పర్వతగిరి గ్రీష్మ, ఎమ్మెల్యేగా కురుమేటి శివ సాయి, ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయులు మిర్యాల దామోదర్, ఉపాధ్యాయులు ముక్కామల లింగమల్లు, బండారు మల్లయ్య, వంగూరి యాదయ్య, దర్శనం వెంకన్న, చిరుమర్తి యాదయ్య, కే కవిత, డి తిరుపతి, కే కృష్ణవేణిలు పాల్గొన్నారు.