Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 37 పిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ వివిధ జిల్లా అధికారులు, తహసీల్దర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.