ముద్ర కూకట్‌పల్లి :
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో సాయంత్రం వేళ వ్యక్తిని బెదిరించి బంగారు గొలుసు అపహరించిన ఘటనలో కూకట్‌పల్లి పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు నమోదైన 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
బాచుపల్లికి చెందిన డాక్టర్ నందిపల్లి కిరణ్ (40) షాపింగ్ నిమిత్తం కూకట్‌పల్లికి వచ్చారు. సాయంత్రం 18:00 గంటల సమయంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక వ్యక్తి స్కూటీపై వెనుక నుంచి వచ్చి ఆయన్ని బెదిరించాడు. కిరణ్ మెడలోని సుమారు 24 గ్రాముల బంగారు గొలుసును (విలువ సుమారు రూ. 25,000/-) బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితుడు అదే రోజు రాత్రి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కూకట్‌పల్లి జోన్ డీసీపీ శ్రీమతి రితిరాజ్ ఆదేశాల మేరకు, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కూకట్‌పల్లి క్రైమ్ టీమ్ మరియు సీసీఎస్ బాలానగర్ బృందం సంయుక్తంగా ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి, ఫీల్డ్ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
తక్కువ సమయంలోనే కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ
ప్రస్తుతం నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.