Take a fresh look at your lifestyle.

చేనేత ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ విధానాలు మానుకోవాలి. -చేనేతకు జీవం పోసిన హైకోర్టు తీర్పును హర్షిస్తున్నాం. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకట నర్సు.

ముద్ర ,మోత్కూర్:

చేనేత పొట్టకొట్టే ఈ టెండర్ విధానాన్ని రద్దుచేసి, గురుకుల విద్యాసంస్థలతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చేనేత వస్త్రాలను తెలంగాణ స్టేట్ హైండ్లుమ్ వీవర్స్ సోసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారానే కొనుగోలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం చేనేతకు జీవం పోయడమేనని ఈ తీర్పును హర్షిస్తున్నామని ఇప్పటికైన చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతీసే ప్రభుత్వ విధానాలను మానుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంతో ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకోవలసిన ప్రభుత్వం, ఈ టెండర్ ద్వారా చేనేత ఉపాధి దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించ్చారు. ప్రభుత్వశాఖలు, సంస్థలకు, ఆసుపత్రులకు టెస్కో ద్వారా లేదా అర్హత కలిగిన ఇతర చేనేత సంఘాల ద్వారా మాత్రమే కొనుగోలు చెయ్యాలని జీవో స్పష్టంగా ఉందని పేర్కొందని టెస్కో సరఫరా చేయలేమని అధికారిక ధ్రువీకరణ ఇచ్చిన తరువాతనే ఇతర మార్గాల్లో కొనుగోలు చేయవచ్చని కోర్టు పేర్కొందని తెలిపారు. ఈ టెండర్ విధానాన్ని రద్దు చేస్తూ టెస్కో ద్వారానే కొనుగోలు చెయ్యాలనే హైకోర్టు తీర్పు చేనేతకు జీవం పోయడమే కాక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే ఈ తీర్పును హర్షస్తున్నామని, ప్రభుత్వం కూడ చేనేత కార్మికుల ఉపాధికి నష్టం కలిగించే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు జెల్ల నాందేవ్, వడ్డేపల్లి లక్ష్మణ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.