ముద్ర కాప్రా
సైనిక్‌పురిలోని ప్యూర్ ఆర్తో హాస్పిటల్స్ వైద్యులు అరుదైన భారీ పెల్విక్ ట్యూమర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. దాదాపు 20×30 సెం.మీ పరిమాణంలో ఉన్న ఆస్టియోకాండ్రోమా కణితిని వైడ్ లోకల్ ఎక్సిషన్ విధానంలో తొలగించారు. డాక్టర్ వి.ఎస్. అభిలాష్ కుమార్ నేతృత్వంలో డాక్టర్లు ఉదయ్ శేఖర్ రెడ్డి, మనోజ్ పుడారి, సాయి కార్తికేయ బద్రి, సాయి కృష్ణ సి.ఎస్.ల బృందం ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.