ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు.

మంగళవారం మహిళా శిశుసంక్షేమ దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ – మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ లోని సమావేశము హాలు నందు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించికలెక్టర్ మాట్లాడుతూ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం. లాభం కోసం ఇవ్వండి అనే థీమ్ తో ముందుకు వెళ్ళాలని ఉద్ఘాటించారు.
మహిళల సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు విద్య, ఉపాధి, ఆరోగ్యం మరియు స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.
సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. మహిళల అభివృద్ధి ద్వారా సమాజం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మహిళలు విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, లింగ వివక్షత పూర్తి స్థాయిలో రూపుమాపాలని, అన్నారు. లింగ వివక్షత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు పూనుకోవాలన్నారు. మన ఇంటి నుండే మార్పు ప్రారంభం కావాలన్నారు. ఆడపిల్లని వేరువేరుగా చూడకుండా ఇద్దరిని సమానంగా చూడాలన్నారు. ఇద్దరికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవశ్యతక ఉందన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో గాను 13 మంది మహిళ కలెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాజంలో పూర్తి స్థాయిలో లింగ వివక్షత రూపు మాపాలని, అప్పుడే నవ సమాజానికి నాంది పలుకుతుందన్నారు.
యూపీఎస్సీ రిజల్ట్ లో కూడా మహిళలు ఎక్కువ శాతం ఉన్నారని, మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా చేయగలరని, అన్ని రంగాలలో రాణిస్తూ ముందుకు వెళుతున్నారని ముఖ్యంగా క్రీడార రంగంలో మహిళల పాత్ర అమోఘమని, భారత దేశంలో నే మహిళలు ఉన్నత స్తానంలో ఉండి గౌరవం దక్కించుకున్నారని, ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిలో పోషన్ అభియాన్, మహిళా శక్తి ఉన్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఇతర ఉద్యోగులు మహిళా నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు. ఒక కుటుంబంలో మహిళా మంచిగా ఉంటే ఆ కుటుంబం మంచిగా ఉంటుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో పాఠశాల స్థాయిలో మహిళల హక్కుల పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతకు ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కల్లెక్ట్రేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంప్ లను కలెక్టర్ సందర్శించారు. కంటి పరీక్షలు, గుండె జబ్బు నిపుణులు, చర్మ వ్యాది నిపుణులతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు నుసందర్శించి ఇప్పటివరకు ఎంత మందికి చెక్ చేశారు. మందులు అందుబాటులో ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్ చేసుకున్న వారి పేర్లు రిజిస్టర్ లో నమోదు చేయాలనీ సంబంధిత డాక్టర్ లకు ఆదేశించారు. ఈ సందర్బంగా బ్లడ్ డొనేషన్ చేసిన వారికీ సర్టిఫికేట్ లను అందజేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు గౌరవం సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నేటి తరం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత అంటే స్త్రీలు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకునేలా, సామాజిక, ఆర్థిక, విద్యా రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు పొంది, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి అద్భుతమైనది. కుటుంబానికి వెన్నెముకగా ఉంటూ, సమాజ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర మరువలేనిది. చిన్నపిల్లలని సాకే అమ్మ నుండి, కుటుంబానికి అండగా నిలిచే భార్య, సోదరి, కుమార్తె వరకు మహిళ ప్రతి రూపంలోనూ ప్రేమాభిమానాలను పంచుతుందని తెలిపారు. అనంతరం వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళ అధికారులనువివిధ క్రీడలలో పాల్గొని గెలుపొందిన వారికీ ఉద్యోగులను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ , అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా వైదాధికారి స్వర్ణ కుమారి, జిల్లా విద్యాధికారి రేణుక దేవి , డి పి ఆర్ ఓ చెన్నమ్మ ,మెప్మా పీడీ రవికుమార్ జిల్లా ఆర్టికల్చర్ ఆఫీసర్ సత్తార్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అర్థ సుధాకర్ రెడ్డి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కాంతారావు, మెహరునిసా, సీనియర్ అసిస్టెంట్ రాములు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, మున్సిపల్ మహిళా కౌన్సిలర్స్ ప్రభుత్వ, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది, డిసిపియు సిబ్బంది, అంగన్వాడీ ఉద్యోగులు, ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు ఇతర మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.