Take a fresh look at your lifestyle.

తెల్లవారితే పెళ్లి…. అంతలోనే కానరాని లోకాలకు

కోరుట్ల/మెట్ పల్లి, ముద్ర: మెట్పల్లి మండలం లోని రామచంద్రంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్ 38 అనే యువకుడు శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆదివారం ఉదయం అతని వివాహం ఉండగా శుక్రవారం రోజు వరకు పెళ్లి పనులను ముగించుకొని పెళ్లికి సిద్ధమయ్యాడు. కార్యక్రమాలు పూర్తిచేసుకుని శుక్రవారం సాయంత్రం ఎప్పటిలానే ఇంటికి వచ్చి తిన్న తర్వాత కాసేపు ఇంటిల్లిపాదీ అర్థరాత్రి వరకు ముచ్చటించి అందరూ పడుకున్నారు.శనివారం తెల్లవారుజామున చూస్తే అతను ఆత్మహత్యకు చేసుకున్న విషయం తల్లి చూసి బోరున విలపించింది.ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.