Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచవద్దు- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి,పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి కలెక్టర్
జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ఆర్జికి ప్రాధాన్యత నిచ్చి సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలన్నారు.
ప్రజావాణిలో రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతి, వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమం, బీసీ అభివృద్ధి శాఖలు, నీటి పారుదల, ట్రాన్స్పోర్ట్, అనిమల్ హస్బెండ్రి, మున్సిపాలిటీలు, ఉపాధి తదితర శాఖలకు సంబంధించి 50 ఆర్జీలు అందాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.