ముద్ర ప్రతినిధి ,హనుమకొండ: వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా న్యాయవాది వలస సుధీర్, ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ లు ఎన్నికయ్యారు. శుక్రవారం హోరా హోరీగా జరిగిన బార్ ఎన్నికల్లో వలస సుధీర్ సమీప అభ్యర్థి ఆనంద్ మోహన్ పై 48 ఓట్ల భారీ మెజార్టీతో అధ్యక్షునిగా గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా రమాకాంత్ సమీప అభ్యర్థి నాగేంద్ర చారిపై 75 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా ఎ శ్రీధర్ సమీప అభ్యర్థి కమలాకర్ పై 86 ఓట్ల మెజారిటీతో, మహిళా జాయింట్ సెక్రటరీ గా శశిరేఖ సమీప అభ్యర్థి గోపికరాణి పై 96 మెజారిటీతో గెలిచారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా శివప్రసాద్, కోశాధికారిగా సిరిపురం అరుణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నాలుగు అభ్యర్థిత్వాలకు ఆరుగురు పోటీ పడగా జె రవి, మర్రి రాజు, జె రవి, ఎం మహేందర్, ఎం మేఘనాథ్ లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జైపాల్, లైబ్రరీ కార్యదర్శిగా కిషోర్ కుమార్, సీనియర్ కార్యనిర్వాహక సభ్యునిగా సిరబోయిన శ్రీనివాస్, సురేష్, మహిళా కార్యనిర్వాహక సభ్యులుగా నిర్మలా జ్యోతి, అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలను ముఖ్య ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది చిదంబర్ నాథ్, తాబేటి శ్రీధర్ లు ప్రకటించారు.
