Take a fresh look at your lifestyle.

జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు ఆకస్మిక తనిఖీ

  • ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ స్కానర్ తో అనుమానితుల వేలిముద్రలు సేకరణ.
  • జిల్లా కేంద్రంలో తనిఖీలు పరిశీలించిన ఎస్పి నరసింహ .
  • పాత నేరస్తులు, సస్పెక్ట్, అనమానితుల కదలికలపై నిఘా.
  • వేలిముద్రలు సేకరించి గత నేరచరిత్ర తనిఖీ.
  • వ్యక్తిగత నిర్ధారణ లేకుండా ఎవరికి నివాసాలు అద్దెకు ఇవ్వకూడదు, గుర్తింపు కార్డులు తీసుకోవాలి.
  • జిల్లాల్లో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తాం, బ్లూ కొట్స్, పెట్రో కార్, నైట్ అలర్టింగ్ అధికారులకు అందరికీ పరికరాలు సమకూరుస్తాం.
  • సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి.
  • అనుమానితుల, స్థానిక సమస్యలపై సమాచారం డయల్ 100 కు ఇవ్వాలి.
  • కె. నరసింహ , ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: జిల్లాలో ప్రజలకు, ప్రజల ఆస్తులకు మెరుగైన రక్షణ, భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్ల ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం స్కానర్ తో అనుమానితుల వేలిముద్రల సేకరించి తనిఖీలు చేయడం జరిగినదనీ ఎస్పి నరసింహ తెలిపినారు. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్, ఖమ్మం అండర్ పాస్, పిఎస్ఆర్ సెంటర్ చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్ చౌరస్తా, వాణిజ్య భవన్ సెంటర్, ఎస్ విడిగ్రీ కాలేజ్ చౌరస్తా, అలాగే కోదాడ పట్టణంలో ముఖ్యమైన కూడల్లో అనేక ప్రదేశాలలో స్కానర్ తో అనుమానితులను తనిఖీలు చేయడం జరిగినది. కొత్త బస్టాండ్ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ ఈ తనిఖీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఆదేశాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మెరుగైన భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా కేంద్రంలో ఎవరైనా పాత నేరస్తులు, అనుమానితులు, ఇతర రాష్ట్రాల్లో నేరాల్లో ఉన్నవారు ఇలా ఎవరైనా సంచరిస్తున్నారా అనే కోణంలో తనిఖీలు చేశామని తెలిపారు. ఈ స్కానర్ నందు పాత నేరస్తుల వివరాలు వారి కేసుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయనీ, డాటా బేస్ లో ఉన్న వేలిముద్రలతో ఎవరైనా అనుమానితుల వేలు ముద్రలు పోలితే వారి వివరాలు స్కానర్ నందు నమోదు అవుతాయి అని తెలిపారు. ఈ తనిఖీల ద్వారా ఎవరైనా అనుమానితులు, నేరస్తులు, దొంగలు సంచరిస్తే అలాంటి వారిని గుర్తించి వారు ఎక్కడెక్కడ నేరాలు పాల్పడ్డారు అనే వివరాలను తలఖీ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఎందుకు ఉన్నారు అని తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రజలు వ్యాపారస్తులు భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు పాటించాలని కోరారు. వ్యాపార సముదాయాలు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భారీ మొత్తంలో నగదు ఆభరణాలు ఉంటే అలారం సిస్టం ఏర్పాటు శ్రేయస్కరమని అన్నారు. ఏటీఎం సెంటర్స్, బ్యాంక్ సెక్టార్స్ వద్ద పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలనీ, అత్యాధునిక సాంకేతికతతో కూడిన చాలా రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెట్రోల్ బంక్ లు, వైన్ షాప్స్, జ్యువలరీ షాప్స్, సూపర్ మార్కెట్స్, రెసిడెన్షియల్ జోన్స్, అపార్ట్మెంట్స్, హోటల్స్, లాడ్జ్, డాబాలు, హాస్పటల్, ఏజెన్సీల వద్ద వారి వ్యాపారాలు కవర్ అయ్యేలా, రోడ్లు కనిపించేలా అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దీని కోసం స్థానిక పోలీసుల సహకారం తీసుకోవచ్చని అన్నారు. గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డు నిర్ధారణ లేకుండా ఆశ్రయం కల్పించవద్దని నివాసాలు అద్దెకు ఇవ్వకూడదని ఎస్పీ అన్నారు. ఆశ్రయం కల్పించే వ్యక్తుల యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇతర గుర్తింపు కార్డులను తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు అపరిచితులు అనుమానితులు ఎవరన్నా వచ్చినట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. లాడ్జిలో, హోటల్స్ నందు వచ్చే వ్యక్తుల వివరాలు తప్పనిసరిగా రికార్డులో నమోదు చేయాలని గుర్తింపు కార్డులను తీసుకోవాలని ఆదేశించారు. అనుమానితులు కొత్త వ్యక్తుల సమాచారాన్ని, స్థానికంగా ఏవైనా గొడవలు కొట్లాటలు లాంటి సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలి అని, ప్రతి పౌరుడు సమాజ రక్షణలో, నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.ఎస్పి వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, స్థానిక సీఐ వెంకటయ్య, ఎస్సై లు, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.