Take a fresh look at your lifestyle.

శ్రీ సరస్వతి శిశు మందిరం లో ఘనంగా చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

కోరుట్ల, ముద్ర: కోరుట్లలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో యుకెజీ విద్యార్థినీ విద్యార్థులకు 1 వ క్లాస్ లోకి ప్రమోట్ ఇస్తూ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని శనివారం రోజు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ నీలి వాసవి పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ నేటి సమాజానికి శిశు మందిరాలు ఎంతో అవసరమని, వీటిలో చదువుతో పాటు ఆట పాటలు, సంస్కృతీ, సంప్రదాయాలు నేర్పిస్తూ పిల్లలను ఉత్తమ దేశ పౌరులుగా, దేశ భక్తులుగా తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.పిల్లలు ప్రదర్శించిన ఆటపాటలు, గేయాలు, పద్యాలు, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన విషయాలు అన్నింటినీ పిల్లల తల్లి దండ్రులు ముచ్చటగా వీక్షించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.సమాజం కొరకు ఉత్తమ పౌరులను తయారు చేయడానికి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తూ పాఠశాలను అన్నీ రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోవడం దీనికి తల్లి దండ్రులు కూడా తమవంతు సంపూర్ణ సహకారం అందించాలని కోరడం జరిగింది.తల్లి దండ్రులు పిల్లల కొరకు కొంచెం సమయం వెచ్చించి రోజూ పిల్లలను కనిపెడుతూ వారు సక్రమ మార్గంలో వెళ్లడానికి తమవంతుగా కృషి చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రబంధకారిణి వనతడుపుల చంద్రం, సమితి కార్యదర్శి చెట్ పల్లి శంకర్, పిస్క రమేశ్, ప్రబంధ కారిణి సభ్యులు అందె శివ ప్రసాద్, ఎలిమిల్ల మనోజ్ కుమార్, కొత్త సందీప్ పాఠశాల కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్, ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, ఆచార్య బృందం, విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.