ముద్ర, భువనగిరి ప్రతినిధి :
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో శనివారం వార్డు నెం.2, 7, 19, 14, 26లలో ప్రారంభించారు.
భువనగిరి పురపాలక సంఘ కార్యాలయంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి చెత్త చెదారంను తొలగించి విరిగిపోయిన ఫర్నిచర్, కుర్చీలను ఇతర సామాగ్రిని, రికార్డు రూం నిర్వహణ ఏర్పాట్లూ, వివిధ వార్డులలో ఫాగింగ్, చెరువు కట్టల వద్ద క్లీనింగ్ వంటి పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post