Take a fresh look at your lifestyle.

ఈ అభివృద్ధి అంతా కేంద్రం పుణ్యమే: ఈటల 

ముద్ర న్యూస్ బ్యూరో కోదాడ: కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడే విధానం చూస్తే జాలి వేస్తున్నదని బిజెపి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు ఆయన కోదాడలో మేధావుల సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్ రాష్ట్రాల వారీగా పెట్టరనే విషయం కూడా కాంగ్రెస్ వారికి తెలియకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

వికసిత్ భారత్ కోసం ఇప్పుడు బడ్జెట్ పెట్టుకుంటున్నామని చెబుతూ ఈ పదేళ్లలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పోల్చితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రపంచంలో ఎవరికి ఆకలి వేసినా అన్నం పెట్టే సత్తా ఇప్పుడు భారత్ కి ఉందని వ్యాఖ్యానించారు.

కరోనా సమయం నుండి కోట్లాది ప్రజానీకానికి 5 కేజీల బియ్యం ఇస్తున్న దేశం మనదని అన్నారు. గ్రామాల్లో పారే మురుగు కాలువలు, నడిచే రోడ్లు, తడి, పొడి చెత్త షెడ్లు, లైట్లు, స్మశాన వాటికలు, రైతు వేదికలు అన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో సమకూరినవేనని చెప్పారు.

హైదరాబాద్ లో ఉన్న రైల్వే స్టేషన్లను రెండు వేల కోట్లు పెట్టి ఆధునీకరిస్తున్నారని, విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారనీ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మూడున్నర కోట్ల మందికి ఇళ్ళు కట్టించి ఇచ్చిందని, మహిళలకు టాయిలెట్స్ కట్టించి వారి ఆత్మగౌరవం నిలబెట్టిందని చెప్పారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి మోదీ అని, మాట ఇస్తే నెరవేర్చే పార్టీ బిజెపి అని రాజేందర్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.