Take a fresh look at your lifestyle.

​వడ్డేపల్లి నివాసంలో ఘనంగా హోలీ వేడుకలు

ముద్ర కూకట్‌పల్లి:

రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
​ఈ వేడుకల్లో కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పరిశుద్ధ కార్మికులు కూడా పాల్గొనడం విశేషం. అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.
ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. హోలీ పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత, ప్రేమాభిమానాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
​”రంగుల్లాంటి వైవిధ్యాలు ఉన్నా, మనమంతా ఒక్కటే అన్న భావనతో సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.”
— వడ్డేపల్లి రాజేశ్వరరావు
​ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.