Take a fresh look at your lifestyle.

ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి

మల్యాల ముద్ర విలేఖరి: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ ” 66,07,656/- లు విలువ గల చెక్కులను శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వసంత, ఎంపీడీవో స్వాతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్, వెల్మ లక్ష్మారెడ్డి, నాగులపేట సంజీవ్, కటకం వినయ్, మ్యాక లక్ష్మణ్, కంచర్లలక్ష్మణాచారి, నేరెళ్ల సతీష్ రెడ్డి, బివి రమణ పటేల్, ఎండి ఇమామ్, సంత ప్రకాష్ రెడ్డి, నక్క అనిల్, మరాఠీ గంగారెడ్డి, తాళ్ల హరినాథ్, దూడం రామాంజనేయులు, వీరబత్తిని పృథ్వీరాజ్, మర్రి లక్ష్మణ్, బండి రవి, మిల్ట్రీ శ్రీనివాస్, కోరేపు వెంకటేష్, కంటే అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.