ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణ ప్రజలు మురికి కలువాలో ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్ధాలు పడవేయడంతో మురికి కాలువలో మురుగు నీరు నిలిచిపోయి కంపు కొడుతోంది. దానిని తొలిగించేందుకు జగిత్యాల బల్దియా సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జగిత్యాల పట్టణంలోని నడిబొడ్డులో తహసీల్ చౌరస్తాలో జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారి రోడ్డు కిందిగా ప్రవహించే మురికి కాలువ లిట్టర్ తో జామ్ అయింది. దీంతో నీరు నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సానిటరీ ఇన్స్పెక్టర్ జి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, శంకర్, రమేష్ అక్కడి చేరుకొని సిబ్బందితో తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు. చివరికి సానిటేషన్ సిబ్బంది మురికి నీటిలో దిగి దానిని క్లియర్ చేశారు. వ్యర్థాలు మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని మురికి కాలువలో వేయవద్దని సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు.
