ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ,
పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య లు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి కాలనీలో వీధి కుక్కలు కోతులు తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పాలకులు అధికారులు పట్టణ ప్రజలపై నిర్లక్ష్యం వహిస్తూ కుక్కలకు కోతులకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు వచ్చిన నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.